బంతి - చిన్నప్పుడు అందరూ ఇష్టపడే ఆట వస్తువు. చిన్న బంతి, పెద్ద బంతి, క్రికెట్ బాల్, ఫుట్ బాల్, బాడ్మింటన్ బాల్ ఇలా రకరకాల బంతులతో ఆడుకున్నాము. బాల్యం గడచి పోయి, ఉద్యోగాలు బాధ్యతలు పెరిగి, ఈ బంతులతో ఆడుకునే అవకాశాలు తగ్గిన తర్వాత నాకు అన్నిటి కంటే పెద్ద బంతి మీద మోజు పుట్టింది. అదే Google Earth. అంత పెద్ద భూగోళాన్ని చిన్నకర్సర్ తో సింపుల్ గా అటుఇటు తిప్పేయడం చాలా సరదాగా ఉంటుంది. గూగుల్ ఎర్త్ పరిచయమైనప్పటి నుండి అందులో విహరించడం ఒక ఇష్టమైన వ్యాపకం గా మారిపోయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఒకసారి గూగుల్ ఎర్త్ చూస్తుంటే, మా కాలనీకి ఆనుకొని ఉండే ఒక కొండపై ఒక చెరువులాంటిది కనిపించింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఒకసారి గూగుల్ ఎర్త్ చూస్తుంటే, మా కాలనీకి ఆనుకొని ఉండే ఒక కొండపై ఒక చెరువులాంటిది కనిపించింది.
ఈ మధ్యనే ఆ చెరువు చూద్దామని కొండపైకి వెళ్లాను. చూస్తూనే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, ఇంతవరకు ఇది సహజంగా ఏర్పడిన చెరువు అని భావించాను. అయితే, ఇది సహజంగా ఏర్పడినది కాదు; అలాగని ఎవరో పనిగట్టుకొని చెరువు కోసం తవ్విందీ కాదు. ఇదొక గని. కొండ మీద రాళ్ళ కోసం తవ్వగా ఏర్పడ్డ పెద్ద గుంత. వర్షం నీళ్ళు చేరి చెరువుగా ఏర్పడింది.
మరో సారి గూగుల్ ఎర్త్ ని ఆశ్రయిస్తే దొరికిన చిత్రాలివి.
2003 జూన్ 11 నాటి చిత్రమిది.
2007 ఫిబ్రవరి 3 నాటి పరిస్థితి.
2010 ఫిబ్రవరి 28 నాటికి గని తవ్వకం పూర్తయినట్లుంది.